హనుమాన్ నగర్ తండా..
లబ్ధిదారులకు చేయూత పత్రాలు అందజేత.
ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని హనుమాన్ నగర్ తండా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఆ గ్రామ సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు తో కలిసి మంగళవారం పెన్షన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు పంపిణీ చేశామని సర్పంచి తెలిపారు.ప్రజా సంక్షేమం,అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందన్నారు.కొత్త పెన్షన్ల రాకతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వితంతువులు, వికలాంగులు,ఒంటరి మహిళలు తదితరులకు ఊరట లభించిందన్నారు. కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.