prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 5:15 pm Digital Edition : PRAJA VANI

సాయుధ పోరాట యోధులకు ఘన నివాళులు

సాయుధ పోరాట యోధులకు ఘన నివాళులు
ఆరేపల్లి జానయ్య, దేవులపల్లి వెంకటేశ్వర్లు త్యాగాలు చిరస్మరణీయం
చిమ్మేముల మండలం, నవంబర్ 17:
సూర్యాపేట జిల్లా చిమ్మేముల మండలం బండమీద చందుపట్ల గ్రామంలో సాయుధ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్టు విప్లవ పోరాట నాయకుడు ఆరేపల్లి జానయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవులపల్లి వెంకటేశ్వర్లు గారిని కూడా స్మరించుకుంటూ వారి త్యాగాలను, ప్రజల కోసం వారు చేసిన పోరాటాలను నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం, సమాజ మార్పు కోసం వారు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రజా ఉద్యమాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గన్నబోయిన వెంకటాద్రి, ఆదిలాబాద్ జిల్లా నాయకులు నేతావత్ రామదాసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి గన్నబోయిన వీరస్వామి, బండమీద చందుపట్ల గ్రామ నాయకులు, మండల సభ్యులు, పలువురు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.