శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కు ప్రత్యేక పూజలు
* గ్రామ దేవతల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని రూ.2.50 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట నవంబర్ 16 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం రెడ్డిపల్లి ఆమ్లెట్ గ్రామాలు (అచ్చంపల్లి, కొత్తపల్లి) గ్రామాల్లో నిర్వహించిన శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారంగా మొత్తం రూ.2,50,000ల విరాళాన్ని అందజేశారు గ్రామ ప్రజలందరికీ అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గ్రామాలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు
