శ్రీరంగవరంలో 54 మందికి నూతన పింఛన్లు మంజూరు
*శ్రీరంగవరంలో 54 మందికి నూతన పింఛన్లు మంజూరు* *కౌన్సిలర్ల కృషితో మహిళలు, దివ్యాంగులకు లబ్ధి.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు* మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం వార్డులో ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు, దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్థానిక కౌన్సిలర్ల ప్రత్యేక చొరవ, కృషితో వార్డుకు చెందిన 54 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అందించిన సహాయ సహకారాలతో ఈ పింఛన్ల మంజూరు సాధ్యమైందని స్థానిక నాయకులు తెలిపారు....