prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 3:47 pm Digital Edition : MAHESH MEDCHAL

శ్రీరంగవరంలో 54 మందికి నూతన పింఛన్లు మంజూరు

*శ్రీరంగవరంలో 54 మందికి నూతన పింఛన్లు మంజూరు*

*కౌన్సిలర్ల కృషితో మహిళలు, దివ్యాంగులకు లబ్ధి.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు*

మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం వార్డులో ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు, దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్థానిక కౌన్సిలర్ల ప్రత్యేక చొరవ, కృషితో వార్డుకు చెందిన 54 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అందించిన సహాయ సహకారాలతో ఈ పింఛన్ల మంజూరు సాధ్యమైందని స్థానిక నాయకులు తెలిపారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోనే అత్యధిక సంఖ్యలో పింఛన్లు శ్రీరంగవరం గ్రామానికి మంజూరు కావడం విశేషం. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు దాది నర్సింహా ముదిరాజ్, ఈటీవీ వీర్లపల్లి ఓం ప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్ తదితరులు లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పింఛన్ల మంజూరుకు కృషి చేశారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా లభించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచి పింఛన్లు మంజూరయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, స్థానిక కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కత్తి సురేందర్, సద్ది కొండల్ రెడ్డి, దాది శంకర్, నాగారం సత్యనారాయణ, వాటర్ ప్లాంట్ శంకర్, సుశాంత్ రెడ్డి, గోల్డ్ సంతోష్ రెడ్డి, దయాసాగర్ గౌడ్, జీడిపల్లి శ్రావణ్, గుమ్మడి యాదగిరి, గోసుల ప్రేమ్ చంద్, వెంకటేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.