prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:17 am Digital Edition : PRAJA VANI

రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం కోల్పోయిన పదవీకాలాన్ని తిరిగి పొందడం సంతోషంగా ఉంది

రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం కోల్పోయిన పదవీకాలాన్ని తిరిగి పొందడం సంతోషంగా ఉంది

* మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

జమ్మికుంటనవంబర్ 16 (ప్రజావాణి)

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్‌పర్సన్.రిజర్వేషన్ కు సంబంధించిన న్యాయపరమైన వివాదం కారణంగా తన పదవీకాలంలో కోల్పోయిన రెండు నెలల 17 రోజుల సమయాన్ని తిరిగి పొందేందుకు హైకోర్టును ఆశ్రయించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు ఊరట లభించింది ఈ నెల 10వ తేదీతో పదవీకాలం ముగియగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీవ్యవసాయ శాఖ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం సోమవారం తిరిగి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారుఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూరిజర్వేషన్‌కు సంబంధించిన న్యాయపరమైన వివాదం కారణంగా తనకు దక్కాల్సిన రెండు నెలల 17 రోజుల పదవీకాలాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు అయితే న్యాయం కోసం న్యాయవాది బాల మురళి ద్వారా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తనకు న్యాయం జరిగేలా సహకరించిన న్యాయస్థానానికి తనకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు పదవిలో ఉన్నంతకాలం రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారుమార్కెట్‌కు వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటువారి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తానన్నారు
రైతుల సంక్షేమం మార్కెట్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మిగిలిన పదవీకాలాన్ని రైతుల సేవకే అంకితం చేస్తానని చైర్‌పర్సన్ పేర్కొన్నారు