prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 10:18 am Digital Edition : PRAJA VANI

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు సిద్ధం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు సిద్ధం

దిష్టిబొమ్మ దహనానికి ముందే బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 17

ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారతదేశ ప్రతిష్టను కించపరిచే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి సిద్ధమైన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. అయితే నిరసన కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

భారతదేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదని, దేశ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి సిద్ధమైన తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన వారిలో పల్లె సదానందం, జంగా చక్రధర్ రెడ్డి, పర్స సమ్మయ్య యాదవ్, భూషణవేణి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.