prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:28 pm Digital Edition : PRAJA VANI

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన.. దిష్టిబొమ్మ దహనానికి ముందే పోలీసుల అరెస్టులు!

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన.. దిష్టిబొమ్మ దహనానికి ముందే పోలీసుల అరెస్టులు!

ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:

ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారతదేశ ప్రతిష్టను కించపరిచే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసనకు సిద్ధమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోత్కపల్లి పోలీసులు బీజేపీ, బీజేవైఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ముందస్తు అరెస్టుల్లో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా మాజీ కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్, బీజేపీ ఓదెల మండల అధ్యక్షుడు కరెంగుల శ్రీనివాస్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సారంగం, బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కొంగర అనిల్, బీజేవైఎం మండల నాయకులు కరెంగుల నవీన్, దాత రాకేష్, అనిల్ రావు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, దేశ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన అంశాలపై రాజకీయాలకు అతీతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడే వ్యాఖ్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండిస్తామని తెలిపారు.

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముందే నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య నిరసన హక్కులను అడ్డుకోవడమేనని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి.