రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా బడికే ఇందిరా నియామకం
జనగాం జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా జనగాంకు చెందిన బడికే ఇందిరా నియమితులయ్యారు
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణక్కకు బడికే ఇందిరా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గత ఆరు సంవత్సరాలుగా జనగాం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన తన ప్రయాణంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
తన సేవలను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టేందుకు సహకరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జనగాం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఇన్ఛార్జి ఇందిరా, పాలకుర్తి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణిలతో పాటు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణక్క నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని బడికే ఇందిరా పేర్కొన్నారు.
తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహిళా కాంగ్రెస్ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు.