prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 6:48 pm Digital Edition : MAHESH MEDCHAL

మేడ్చల్ బీజేవైఎం అధ్యక్ష బాధ్యతలు.. పార్టీ ముఖ్య నేతలతో మర్యాదపూర్వక భేటీ

*బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షునిగా నియామకం.. పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధ్యక్షుడు”

మేడ్చల్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మేడ్చల్ డివిజన్ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా నూతన అధ్యక్షుడు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీలు అమరం మోహన్ రెడ్డి, గోనె శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్, జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, గౌరారం జగన్ గౌడ్, సముద్రాల హంస రాణికృష్ణ గౌడ్, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండం ఆంజనేయులు, మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు శైలజ హరినాథ్, డివిజన్ సెక్రటరీ బొక్క సురేందర్ రెడ్డి (శ్రీనివాస్)లను మర్యాదపూర్వకంగా కలిసి తన నియామకానికి సంబంధించిన విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీజేవైఎంను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఆకాంక్షించారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి, బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.