**భారత్ సమ్మిట్‌పై బీజేపీ ఫైర్.. వరంగల్ సీపీకి ఫిర్యాదు!**
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ – 2026లో భారతదేశ సార్వభౌమాధికారానికి, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ ప్రతినిధులు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధుల వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, నిరుద్యోగుల ఉద్యోగాల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రత పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని గంట రవికుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మారెడ్డి, డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, పులి సర్వోత్తం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.