*బోరంచ లో 30 చేయూత పింఛన్లు మంజూరు*
*ప్రజా వాణి న్యూస్ నవంబర్ 17 సంగారెడ్డి జిల్లా*
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి చెందిన 30 మంది చేయూత పింఛన్లు మంజూరైనట్లు బోరంచ గ్రామ సర్పంచ్ పంచాగమ బీరప్ప పంచాయతీ కార్యదర్శి సంతోష్. అన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పెదాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. 17 న మంగళవారం మనుర్ మండల పరిధిలోని రైతు వెదిక లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి. చెతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం 19 న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పెన్షన్ మొత్తాన్ని జమ చేసేవిధంగా సంబందిత విభాగాలు ఏర్పాటు చేస్తున్నాయి. చేయూత లబ్ధిదారులు విధిగా హాజరు కావాలని సర్పంచ్ పంచాగమ బీరప్ప పంచాయతీ కార్యదర్శి సంతోష్ తెలిపారు.