prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 1:08 pm Digital Edition : PRAJA VANI

ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు

ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 17

మిర్యాలగూడ మండలంలోని క్రిస్టాపురం గ్రామ సమీప బైపాస్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లిగుట్ట తండాకు చెందిన రైతులు ధాన్యంతో ట్రాక్టర్‌పై వెళ్తుండగా, టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి.
అదే మార్గంలో వెళ్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన సొంత వాహనంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.