*ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖ్యత కలిగింది జర్నలిజమే*
*ప్రజ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేది పాత్రికేయులే*
*జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా సిద్దు రావణ్*
*భీమ్ ఆర్మీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్తులకు ఘన సన్మానం*
జహీరాబాద్, నవంబర్ 16 (ప్రజావాణి): పట్టణంలోని భీమ్ ఆర్మీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధూ రావణ్ చేతుల మీదుగా జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రం శాలువా వేసి ఘనంగా పాత్రికేయ మిత్రులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు, పాలకవర్గానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కలంతో పోరాడే జర్నలిస్టులను గుర్తించి ఈ విధంగా సన్మానించడం అనేది చాలా అరుదు. అలాంటిది భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధూ
రావన్ గుర్తించి సన్మానించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగులో ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని సామాజిక చైతన్యంతో అహర్నిశలు పోరాడుటకు భీమ్ ఆర్మీ సిద్ధంగా ఉంటుందని, సమాజంలో మంచి చేసే ప్రతి వారి పక్షాన భీమ్ ఆర్మీ ఉంటుంది అదేవిధంగా బలహీనుల గొంతుకై వారి తరఫున మాట్లాడే అక్షర సైనికులు అందరిని గుర్తించి సన్మానించడం నా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ధనుంజయ్, భీమ్ ఆర్మీ టౌన్ ప్రెసిడెంట్ అలీ, నర్సింలు, బాలరాజు, రాచన్న, బలరాం అలీ అల్లిపూర్ విలేజ్ ప్రెసిడెంట్, మహేష్, అరుణ్, రఫీ, ఖయ్యుం, విజయ్ అనంతరం రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.