పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.
*పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు - సర్పంచ్ వెంకటయ్య.!* ప్రజావాణి,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 17 :ఆమనగల్లు మండల అభివృద్ధి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పోలేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం కార్యదర్శి వెంకటయ్య కోరారు. ఆదివారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయరాం విజయ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన పోలేపల్లి గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ముఖ్య...