పోలీస్ గ్రీవెన్స్ డే లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్
*పోలీస్ గ్రీవెన్స్ డే లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* *ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో..* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి,పరిశీలించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన మొత్తం 28 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలు, సివిల్ వివాదాలు,...