prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:35 am Digital Edition : PRAJA VANI

పోలీస్ గ్రీవెన్స్ డే లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

*పోలీస్ గ్రీవెన్స్ డే లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్*

*ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో..*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి,పరిశీలించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధి నుంచి వచ్చిన మొత్తం 28 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలు, సివిల్ వివాదాలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన అంశాలపై తమ ఫిర్యాదులను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రతి బాధితుడి సమస్యను విని ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, నిర్దిష్ట కాలవ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై పురోగతిని పర్యవేక్షిస్తూ బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే, ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.