prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 6:10 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేశపావుల వినోద్ కుమార్ నియామకం

పోచారం, నవంబర్ 17: పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన కేశపావుల వినోద్ కుమార్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, యువతను ఐక్యం చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.

వినోద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోచారం డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. కేశపావుల వినోద్ కుమార్ రాజకీయ ప్రస్థానం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపారు.