prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:33 am Digital Edition : PRAJA VANI

పెద్దకొడెపాక గ్రామానికి చెందినయువతి అదృశ్యం కేసు నమోదు

పెద్దకొడెపాక గ్రామానికి చెందినయువతి అదృశ్యం కేసు నమోదు

ప్రజావాణి శాయంపేట

మండలంలోనిపెద్దకోడెపాక గ్రామానికి చెందిన కోగిల సదానందం, S/o జంపయ్య తన కుమార్తె కోగిల సంధ్య, వయస్సు 25 సంవత్సరాలు, గత రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నదని, ఈ క్రమంలో తేదీ 15-11-2026 రోజున సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన కుమార్తె ఇంటి వద్ద కనిపించకుండా పోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు బంధువుల వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు అదృశ్యమైన యువతి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామనీ తెలిపారు