పల్లెటూరి కేఫ్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఎండపల్లి మండలం రాజారంపల్లిలో ఇటీవల పునఃప్రారంభమైన 'పల్లెటూరి కేఫ్'ను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లతో కలిసి ఆయన చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. కేఫ్ నిర్వాహకులు నలువాల అరవింద్ యాదవ్‌కు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్‌తో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు.