prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 1:03 pm Digital Edition : PRAJA VANI

నేడు నూతన పెన్షన్ల పంపిణీ..

నేడు నూతన పెన్షన్ల పంపిణీ..

– ముఖ్యఅతిథిగా హాజరవుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.

లబ్ధిదారులకు పేన్షన్ పత్రాల అందజేత..

సర్పంచులు, నాయకులు, యువ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలి.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 17

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గూండూర్ రోడ్డు లో లక్ష్మి ఫంక్షన్ హాల్ లో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరవుతున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ తెలిపారు..
మండలంలోని అన్ని గ్రామాల నుండి కొత్తగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపిలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయనున్నారు…

…..పేదలకు అండగా ప్రభుత్వం-ఆసరా పెన్షన్లు…

యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ…….. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వంటి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పెన్షన్ అందేలా కృషి చేస్తున్నమని తెలిపారు.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చొరవతో మండలంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరయ్యాయని, ఇది పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు.. ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులకు, ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ఈ పెన్షన్ నెల నెల ఎంతో భరోసా ఇస్తుందన్నారు.. కొత్తగా పెన్షన్ వచ్చిన లబ్ధిదారులు తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని, తమ ఆధార్ కార్డు వంటి పత్రాలు వేంట తెచ్చుకోవాలని సూచించారు.. పెన్షన్ డబ్బులు ప్రతి నెల నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని తెలిపారు.. ఇంకా పెన్షన్ రాని అర్హులు ఉంటే సర్పంచ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు….

అందరూ హాజరు కావాలి- పిలుపు

మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు , ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ కోరారు.. ప్రతి గ్రామం నుండి లబ్ధిదారులను కార్యక్రమానికి తీసుకురావాల్సిన బాధ్యత సర్పంచులు, నాయకులదే అని అన్నారు.. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాటు చేస్తున్నామని త్రాగునీరు, కూర్చోడానికి ఏర్పాట్లు, నీడ కోసం ఒక ఫంక్షన్ హాలు ఏర్పాటు చేశామని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు..