prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:22 pm Digital Edition : PRAJA VANI

నల్లకుంట తండా లబ్ధిదారురాలికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే , సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్

నల్లకుంట తండా లబ్ధిదారురాలికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే , సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్లకుంట తండా గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారురాలు బానోత్ కమలమ్మకు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, నల్ల కుంట సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్లకుంట తండా సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మి చెక్కు అందుకున్న లబ్ధిదారురాలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.