prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:40 am Digital Edition : PRAJA VANI

నల్గొండ వన్‌టౌన్ సీఐగా సంధ్య పోగుల క్రాంతి కుమార్ బాధ్యతల స్వీకరణ

*నల్గొండ వన్‌టౌన్ సీఐగా సంధ్య పోగుల క్రాంతి కుమార్ బాధ్యతల స్వీకరణ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ వన్‌టౌన్ సీఐగా సంధ్య పోగుల క్రాంతి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి నుంచి నల్లగొండకు బదిలీపై వచ్చిన ఆయన గతం లో నల్లగొండ, మిర్యాలగూడలో ఎస్‌.ఐ. గా విధులు నిర్వహించిన అనుభవం ఉంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వన్‌టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రాధాన్యత అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా డైల్ 112 ద్వారా గానీ, నేరుగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గానీ సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.