prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:23 am Digital Edition : PRAJA VANI

నల్గొండ బస్ స్టాండ్ లో దొంగతనాలు – ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి

*నల్గొండ బస్ స్టాండ్ లో దొంగతనాలు – ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ జిల్లా బస్ స్టాండ్ లో బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దొంగలు ప్రయాణికుల జేబుల్లో నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు, పర్సులు కొట్టేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టార్గెట్ అవుతున్నారని అంటున్నారు.
ప్రయాణికులు తమ విలువైన వస్తువులు, డబ్బు, ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బస్ స్టాండ్ లో పోలీస్ నిఘా పెంచి, దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.