prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 10:22 am Digital Edition : PRAJA VANI

నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు గ్రామ కమిటీల ప్రకటన

నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు గ్రామ కమిటీల ప్రకటన

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి – మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి

నడికూడ, ప్రజావాణి పత్రిక: టీపీసీసీ, డీసీసీ నాయకత్వంతో పాటు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ కమిటీతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కమిటీలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నెం మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా పర్నెం మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ జెండాను ఎగురవేయాలని ఆకాంక్షించారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో నడికూడ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాలని కోరారు.