దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పింఛన్ల పంపిణీ.
బెల్ట్ షాపుల తొలగింపునకు సర్పంచ్లు గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలి.
పేదలకు బిడ్డల చదువే అసలైన అస్త్రం.ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలి.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటగిరి 50 పడకల ఆసుపత్రి ప్రారంభం.
ఆరు అంశాలతో గ్రామాల సమగ్ర సమాచారం సిద్ధం చేయాలి.
ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదు.బీఆర్ఎస్ నాయకులది తప్పుడు ప్రచారం.
పోచారం శ్రీనివాస్ రెడ్డి.
చాలీచాలని నిధులతోనే రాష్ట్రంలో ప్రజా రంజక పాలన.
కాసుల బాలరాజు.
మూడు మండలాల్లో 1,173 మంది అర్హులకు కొత్త చేయూత పింఛన్ల పత్రాల అందజేత.
బాన్సువాడ/ప్రజావాణి:-దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పింఛన్లు అందిస్తున్నామని,గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించేలా గ్రామ సభల ద్వారా సర్పంచ్లు తీర్మా నాలు చేయాలని, ఇందుకు పోలీస్ శాఖ అండగా ఉండాల ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచా రం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.చాలీచాలని నిధులతోనే ఎన్నో ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రంజక పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు.మంగళ వారం నియోజకవర్గంలోని పోతంగల్,కోటగిరి,రుద్రూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూ రైన చేయూత పింఛన్ల పత్రాలను పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా కోటగిరి మండలానికి 356,పోతంగల్ మండలానికి 447,రుద్రూర్ మండలానికి 370 చొప్పున మొత్తం 1,173 మందికి కొత్త పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన సభల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం పంట లకు క్రాప్ హాలిడే ప్రకటించిందని కొందరు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ.ఎల్నినో ప్రభా వం దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించ లేదని.నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించిందే తప్ప,అసలు పంటలే వేసుకో వద్దని ఏనాడూ చెప్పలేదు అని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని వివరించారు.అంతేకా కుండా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు,పెట్రోల్ బంకుల ఏర్పాటు కు సబ్సిడీ ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.పేద కుటుంబాలకు తమ బిడ్డల చదువే అస్త్రమని,తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా నియోజక వర్గంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామ ని.త్వరలోనే కోటగిరి లోని 50 పడకల ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించా రు.పురుషులు మద్యం,రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యు వాత పడుతుండటం వల్ల వితంతు వుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంద రూ ఆరోగ్యకరమైన ఆహారం,స్వచ్ఛమైన నీరు,పరిశుభ్ర మైన గాలితో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం మూడు మండలాల్లోని గ్రామ సర్పంచ్లు తమ గ్రామాల్లోని 6 ప్రధాన అంశాల తో కూడిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని పోచారం సూచించా రు.గ్రామంలో ఉన్న మొత్తం కుటుంబాలు ఎన్ని,ఆ కుటుంబాల్లో నివాస గృహాలు ఉన్నవారు ఎందరు,ఇప్పటి వరకు ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చాము, ఎంతమంది ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటు న్నారు,ఇళ్లు లేకుండా కేవలం స్థలాలు మాత్రమే ఉన్నవారు ఎంతమంది, అసలు సొంత స్థలం లేని వారు ఎంతమంది అనే ఆరు అంశాలపై నిక్షిప్త సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయన్న,ఆర్డీవో విజయ కుమారి,పోతంగల్,కోటగిరి, రుద్రూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్,షాహిద్ హుస్సేన్,తోట అరుణ్ కుమార్,ఆయా మండలాల సర్పంచ్ల ఫోరం కన్వీనర్లు సింధె షాజీ పాటిల్,బర్ల మధుకర్,కొండల్వాడి శంకర్,ఉమ్మడి కోటగిరి, రుద్రూర్ మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్,నారోజీ గంగారం, కోటగిరి, వర్ని ఏఎంసీ చైర్మన్లు గైక్వాడ్ హనుమం తు,సురేష్ బాబా,పోతంగల్,రుద్రూర్ గ్రామాల సర్పంచ్లు కల్లూరి సంధ్యా రాణి హన్మండ్లు,ఇందూర్ సునీత చంద్ర శేఖర్, సీనియర్ నాయకులు బీర్కూర్ గంగాధర్,ఎజాస్ ఖాన్, నీరడి గంగాధ ర్,పత్తి రాము,తోట సంగయ్య,మూడు మండలాల ఎంపీడీవోలు,తహసీల్దార్లు,సర్పంచ్లు,మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,చేయూత పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.