దేవరుప్పుల మండలంలో 31 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

దేవరుప్పుల మండలంలో 31 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 31 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన మొత్తం రూ.31,03,596 విలువైన చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో...