prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 5:20 pm Digital Edition : PRAJA VANI

దేవరుప్పుల మండలంలో 31 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

దేవరుప్పుల మండలంలో 31 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 31 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన మొత్తం రూ.31,03,596 విలువైన చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్,దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.