చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం:- ( ప్రజావాణి)ఇంచార్జ్ మదుసుదన్ చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నిజాంపేట్: మండల కేంద్రంలోని ఎన్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మండలానికి చెందిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాకు అత్యధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరు కాగా, నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా పెన్షన్లు రావడం విశేషమన్నారు. నిజాంపేట్ మండలానికి మొత్తం 344 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు....