చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెర్పోల్ గ్రామ పాలకవర్గం
• పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
• సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి | నవంబర్ 17 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెర్పోల్ గ్రామ పాలకవర్గం పాల్గొంది. ఈ కార్యక్రమానికి తెర్పోల్ గ్రామ ఉపసర్పంచ్ బేగరి మల్లేశం, తెర్పోల్ ఎదురుగూడెం సర్పంచ్ సతీష్ ముదిరాజ్‌తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.