ఘట్కేసర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొక్క సంజీవరెడ్డి నియామకం
ఘట్కేసర్, నవంబర్ 17: ఘట్కేసర్ 6వ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన బొక్క సంజీవరెడ్డికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ యువతను ఐక్యం చేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. తనపై నమ్మకంతో అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువజన...