గిరిజన సర్పంచ్‌పై దాడికి నిరసనగా పాలకుర్తిలో బీఆర్ఎస్ ధర్నా
గిరిజన సర్పంచ్‌పై దాడికి నిరసనగా పాలకుర్తిలో బీఆర్ఎస్ ధర్నా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం గుడిగుంట తండా గిరిజన సర్పంచ్ భానోత్ మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. దీంతో చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గిరిజన ప్రజాప్రతినిధిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం...