గిరిజన సర్పంచ్‌పై దాడికి నిరసనగా పాలకుర్తిలో బీఆర్ఎస్ ధర్నా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం గుడిగుంట తండా గిరిజన సర్పంచ్ భానోత్ మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. దీంతో చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గిరిజన ప్రజాప్రతినిధిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
దాడికి బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహేందర్ నాయక్‌కు తక్షణ న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.
రాజీవ్ చౌరస్తాలో ప్రభుత్వానికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గిరిజనుల గొంతుకను అణచివేయాలని చూస్తే సహించేది లేదని, గిరిజన ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
మహేందర్ నాయక్‌కు పాలకుర్తి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
అనంతరం పోలీసులకు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ పాలకుర్తి బొబ్బాల అశోక్ రెడ్డి, గిరిజన నాయకులు గాంధీ నాయక్, జై సింగ్, మహేష్ నాయక్, కాల్ రామ్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రబెల్లి వినయ్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు పాము శ్రీను, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గడ్డం కిరణ్, జరుపుల బాలు నాయక్, గాదెపాక కిరణ్, పాలకుర్తి ఉప సర్పంచ్ మామిండ్ల శోభన్, పందిరిబోయిన శ్రావణ్ ముదిరాజ్, సురేష్ నాయక్, నాగరాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.