కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన
బోడుప్పల్, నవంబర్ 16: మెక్‌డోవెల్ కాలనీ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కాలనీ ముఖ్య సలహాదారు, సీనియర్ నాయకుడు బొమ్మకు బలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు రావాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు వివిధ సామాజిక, శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ...