prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 6:32 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన

బోడుప్పల్, నవంబర్ 16: మెక్‌డోవెల్ కాలనీ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కాలనీ ముఖ్య సలహాదారు, సీనియర్ నాయకుడు బొమ్మకు బలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు రావాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు వివిధ సామాజిక, శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెక్‌డోవెల్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేడి మల్లేష్, సలహాదారులు వి. శ్రీనివాస్ రావు, డి. యాది రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పి. ప్రకాష్, ఎం. కిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు ఎండీ. ఆజం ఖాన్, ఎన్. బాషా, సంయుక్త కార్యదర్శులు జి. లోకేష్, కె. రామకాంత్ రెడ్డి, ఆర్. ఆనంద్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎన్. వెంకట్ వర్మ, జి. సదాశివరావు, సాంస్కృతిక కార్యదర్శులు ప్రభాకర్ మారుతి బాబర్, ఎం. శ్రీనివాస్, కోశాధికారి వి. తిరుపతి రెడ్డి, సంయుక్త కోశాధికారి జి. శ్రీనివాస్ (వాసు), కార్యవర్గ సభ్యులు ఏటీ కృష్ణకుమార్, జోసెఫ్ థామస్, కె. నరసింహాచారి, ఎండీ. తాజుద్దీన్, బి. సుదర్శనాచారి, కె. ప్రభాకర్, ఎం. గంగాధర్, జిష్ణు రాజ్ నాయర్, జి. రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.