prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 11:40 am Digital Edition : PRAJA VANI

ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ్

*ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ చర్చ్*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్17

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.అశ్వారావుపేట పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం,పాల్వంచసబ్ డివిజనల్ ఆఫీసర్ సతీష్ కుమార్. సూచన మేరకు,అశ్వరావుపేట మండలంలో గల వడ్డెరంగాపురం గ్రామం నందు కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, జరిగింది. ఇట్టి కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాంలో మొత్తం 91 ఇళ్లను సోదా చేయడం జరిగింది, అలాగే ఆ గ్రామంలో గల 83 ద్విచక్ర వాహనాలు మరియు 11 ఆటోలు మరియు ఆరు ట్రాక్టర్లు వాటి యొక్క వాహన పత్రాలు పరిశీలించిన తర్వాత 15 ద్విచక్ర వాహనాలు యొక్క పత్రాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాటిపై చలాన్ విధించి వాటిని అప్పటికప్పుడే చలాన్ ను కట్టించడం జరిగింది. అలాగే సరైన ధ్రువపత్రాలు చూపించని ఐదు ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు అందరికీ కూడా రాబోవు సంక్రాంతి పండగ ను పురస్కరించుకొని ఎవరూ కూడా గ్రామంలో కోడిపందాలు మరియు పేకాట కు సంబంధించిన జూద శిబిరాలు నిర్వహించడం కానీ వాటిలో పాల్గొనడం గాని చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అలాగే గంజాయి మరియు సైబర్ క్రైమ్ వంటి నేరాలు చేయకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడం జరిగింది. అలాగే మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అశ్వరావుపేట మండల ప్రజలందరికీ అశ్వరావుపేట పోలీసు వారు తెలియజేయునది ఏమనగా రాబోయే సంక్రాంతి పండగ మరియు కొత్త సంవత్సరం పురస్కరించుకొని ఎవరన్నా కోడిపందాలు మరియు పేకాట శిబిరాలు నిర్వహించిన మరియు వాటిలో పాల్గొన్నట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వారి తరఫున హెచ్చరించడం జరుగుతుంది. అశ్వరావుపేట మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండడానికి మరియు ముఖ్యంగా గంజాయి యొక్క రవాణా మరియు వాడకం వంటి వాటిపై నిగా పెట్టి యొక్క చర్యలను ఉక్కుపాదంతో అణచటానికి పోలీసు వారు నిత్యం ఈ విధంగా అన్ని గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ,చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అని అన్నారు,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట సిఐ నాగరాజు రెడ్డి , అశ్వరావుపేట ఎస్ హెచ్ ఓ సాయి కిషోర్ రెడ్డి, అదనపు ఎస్ఐ దేవ్ సింగ్, దమ్మపేట అదనపు ఎస్ఐ బాలస్వామి, మరియు అశ్వరావుపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు వడ్డరంగాపురం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.