ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం అందజేత
*ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం అందజేత* *తాడిపర్తి గ్రామ పెద్దలకు నగదు అందజేసిన మర్రి నిరంజన్ రెడ్డి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 17 (ప్రజావాణి):ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి టీపీసీసీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఈరోజు గ్రామ పెద్దలకు రూ.50 వేల నగదును అందించారు. గ్రామంలో...