*ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం అందజేత*
*తాడిపర్తి గ్రామ పెద్దలకు నగదు అందజేసిన మర్రి నిరంజన్ రెడ్డి*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 17 (ప్రజావాణి):ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి టీపీసీసీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఈరోజు గ్రామ పెద్దలకు రూ.50 వేల నగదును అందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయ నిర్మాణాలకు సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముప్పిడి రమేష్, నాయకులు సురేష్ మల్లారి, చిరంజీవి, శ్రీధర్, జంగయ్య, సురేష్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.