ఘట్కేసర్, నవంబర్ 17: ఎదులాబాద్ 7వ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన చిలుగురి నిఖిల్‌కు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ యువతను ఐక్యం చేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
తనపై నమ్మకంతో అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎదులాబాద్ డివిజన్లో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. చిలుగురి నిఖిల్ రాజకీయ ప్రస్థానం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.