ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ
గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం
మద్దూరు నవంబర్17, ప్రజా వాణి,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేర్యాల రేణుక గార్డెన్లో నిర్వహించారు.ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా గాగిల్లపూర్ గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఎంపీడీవో శ్రీనివాస్,సూపరిండెంట్ వేణుగోపాల్ ,వితంతు, వికలాంగులు ఒంటరి మహిళ పింఛన్లు 27 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.