ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహం

*ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహం* *దిగ్వాల్ విద్యార్థిని ఆల్మాస్ తంకీన్‌కు చెక్కును అందించిన ఏంఈఓ* *శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున లక్ష నగదు బహుమతి* కోహీర్, నవంబర్ 16 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి కోహీర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (దిగ్వాల్) పదవ తరగతి విద్యార్థిని ఆల్మాస్ తంకీన్ జహీరాబాద్ తాలూకా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. 2025-2026 విద్యా సంవత్సరంలో కనబరిచిన ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా శ్రీరామ్ లైఫ్...