prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:35 am Digital Edition : PRAJA VANI

ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహం

*ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహం*

*దిగ్వాల్ విద్యార్థిని ఆల్మాస్ తంకీన్‌కు చెక్కును అందించిన ఏంఈఓ*

*శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున లక్ష నగదు బహుమతి*

కోహీర్, నవంబర్ 16 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి కోహీర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (దిగ్వాల్) పదవ తరగతి విద్యార్థిని ఆల్మాస్ తంకీన్ జహీరాబాద్ తాలూకా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. 2025-2026 విద్యా సంవత్సరంలో కనబరిచిన ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ 1,00,000 (ఒక లక్ష రూపాయలు) నగదు బహుమతిని ప్రకటించింది.
పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక అభినందన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కోహీర్ మండల విద్యాశాఖాధికారి (MEO) జాకీర్ హుస్సేన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ ప్రవీణ్ 1 లక్ష చెక్కును విద్యార్థిని ఆల్మాస్ తంకీన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి దీటుగా రాణిస్తూ తాలూకా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని కొనియాడారు. ఇతర విద్యార్థులు కూడా ఆల్మాస్ తంకీన్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజమాన్యానికి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆల్మాస్ తంకీన్ కీ అభినందించారు.