ఈ యాసంగిలో పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి.

ఈ యాసంగిలో పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి. మండల వ్యవసాయ అధికారి బూరెల రామకృష్ణ మద్దూరు నవంబర్17, ప్రజా వాణి, ఈ యాసంగి సీజన్లో ఎల్ నినో ప్రభావం కారణంగా రాబోయే యసంగిలో వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందున రైతులందరూ పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బూరెల రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని...