prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 1:05 pm Digital Edition : PRAJA VANI

ఈ యాసంగిలో పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి.

ఈ యాసంగిలో పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి.

మండల వ్యవసాయ అధికారి బూరెల రామకృష్ణ

మద్దూరు నవంబర్17, ప్రజా వాణి,

ఈ యాసంగి సీజన్లో ఎల్ నినో ప్రభావం కారణంగా రాబోయే యసంగిలో వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందున రైతులందరూ పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బూరెల రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణాన్ని పప్పు ధాన్యాలు ,నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల, సాగుకు మళ్ళించాలి.
అలాగే ఈ యాసంగిలో రైతులు శనగ ,కంది ,పెసర, మినుము,జొన్న ,మొక్కజొన్న, నువ్వులు,కూరగాయలు వంటి పంటలు సాగు చేసుకోవాలన్నారు.
పంటల మార్పిడిలో భాగంగా యాసంగిలో ప్రతి రైతు సాగు చేస్తున్న పంట విస్తీర్ణం పంట రకం అవసరమైన సదుపాయాల వివరాలను ఏ ఈ ఓకు అందించి క్రాప్ డేటా పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు.
ఉద్యాన పంటల సాగు చేసే రైతులు డ్రిప్పు ,స్ప్రింక్లర్స్, మల్చింగ్ కవర్స్ ,అలగే పెండాల్సు కూరగాయల కోసం రైతులు కూడా ఆన్లైన్లో సాగు వివరాలు నమోదు చేసుకోవాలి….
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.