ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు – జడ్జి హిమబిందు
ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రిన్సిపల్ జడ్జి
జగ్గయ్యపేట, నవంబర్ 16 – మన ప్రజావాణి
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జగ్గయ్యపేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ప్రిన్సిపల్ జడ్జి హిమబిందు అన్నారు. సోమవారం జగ్గయ్యపేటలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. ప్రతి విద్యార్థి 15 సంవత్సరాల పాటు ఇష్టంతో చదివితే జీవితాంతం సుఖపడవచ్చని తెలిపారు. అదేవిధంగా పుట్టిన ఊరు, చదువుకున్న బడి, గుడిని మర్చిపోకూడదని సూచించారు. సెల్‌ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం. విజయ కుమారి, గాంధీ, మాతంగి నరేష్, ప్రసాదు, మన్నెం మురళి, మండల లీగల్ సెల్ ప్రతినిధులు అనూష, వాలంటీర్ నూకపోగు నాగ కుమారి తదితరులు పాల్గొన్నారు.