prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇల్లు కోసం ఎమ్మెల్యేను వేడుకున్న వికలాంగుడు

*ఇందిరమ్మ ఇల్లు కోసం ఎమ్మెల్యేను వేడుకున్న వికలాంగుడు*

20 ఏళ్లుగా గుడిసెలోనే నివాసం..* *ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు*

నర్సింహులపేట ప్రజా వాణి రిపోర్టర్ నవంబర్ 16 :
నర్సింహులపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్‌ను జయపురం గ్రామానికి చెందిన గుజ్జునూరి యాకయ్య వికలాంగుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు.
గత 20 ఏళ్లుగా గుడిసెలోనే నివసిస్తున్నానని, తనకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వినతిపత్రం అందజేస్తూ ఎమ్మెల్యే కాళ్లపై పడి ప్రాదేయపడ్డాడు.
అర్హులైన నిరుపేదలకు కాకుండా ఇళ్ళు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నారని, తనకు కూడా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.
20 ఏళ్లుగా గుడిసెలోనే జీవనం సాగిస్తున్న వికలాంగుడి దీనస్థితి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.