ఇంటి చుట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గాగిల్లాపూర్ లో ఘనంగా డ్రైడే
గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం
మద్దూరు నవంబర్17, ప్రజా వాణి,
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఎనిమిదో వార్డులో పర్యటించి ఇంటింటికి వెళ్లి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికినీరు నిల్వ ఉంచుకోవద్దని నీటి కుళాయిలను ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవాలని అంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల,అంగన్వాడి టీచర్ గుడిసె అరుణ,8 వ వార్డు సభ్యులు బసవరాజ్ స్వామి, 9వ వార్డు ఏలూరు శివ,ఆశా వర్కర్ బాబాయ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.