prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 1:53 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఆటో కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందిస్తాం: మంత్రి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను వెల్గటూర్ మండల జై హనుమాన్ డీజిల్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించి, ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు సంఘ రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కుశనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షుడు జగడం కోటేశ్వరరావు, కోశాధికారి బిడారి శ్రీనివాస్, రూట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.