అన్నోజిగూడలో ఘనంగా నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ఘట్‌కేసర్, నవంబర్ 16: పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడలో కొలువై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అభయ ఆంజనేయ, షిరిడీ సాయిబాబా, శ్రీశ్రీశ్రీ ధర్మశాస్తా అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసం, అయ్యప్ప మాలధారణ సీజన్‌ను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఈ పవిత్ర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆలయానికి వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రుచికరమైన,...