బద్వేల్ మండలం చింతలచెరువు సర్పంచ్ అభ్యర్థిగా ద్వారంపూడి లావణ్య నామినేషన్ దాఖలు
బద్వేల్,నవంబర్ 16 ప్రజావాణి బద్వేల్ మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగే ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. చింతలచెరువు సర్పంచ్ అభ్యర్థిగా కడప జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సతీమణి ద్వారంపూడి లావణ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టాయపల్లె గ్రామ సచివాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు ద్వారంపూడి లావణ్య తన మద్దతుదారులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువతతో కలిసి భారీ...